మెగా డీఎస్సీని వెంటనే రిలీజ్ చేయండి

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకట్.

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని కొఠారీ కమీషన్ తెలియజేసింది. కానీ పాలకులు విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా తూట్లు పోడుస్తున్నారు.అందుకు ఇటీవలే విడుదలైన తెలంగాణ డి.ఎస్సి అతి తక్కువ పోస్టుల నోటిఫికేషనే కారణం.ప్రభుత్వ పాఠశాలల్లో 20 వేలకు పైగా ఖాళీలున్నాయని పలు నివేదికలు తెలియజేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 13500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా తెలియజేసారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 5 లక్షలకు పైగా టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులున్నారని అంచనాలున్నాయి.ఎన్నో ఏండ్లుగా నోటిఫికేషన్లు లేవు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఖాళీలు పూరించండి అన్నట్లుగా హాస్యాస్పదంగా అతి తక్కువ పోస్టులతో తక్కువ సమయం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. తమకి జరిగిన నష్టంపై ఇప్పటికే అభ్యర్థులు ఎన్నోసార్లు ధర్నాలు చేస్తూ,వినతిపత్రాలిస్తూ అధికారులకు,స్వయనా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి తెలియజేసిన స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది తెలంగాణలో DE.D లేదా B.ED నిరుద్యోగ టీచర్స్ అభ్యర్థులకు మాత్రమే జరుగుతున్న నష్టం కాదు యావత్ తెలంగాణ పేద ప్రజలకు జరుగుతున్న నష్టం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోతే హాజరు శాతం తగ్గుతుంది.హాజరు శాతం తగ్గితే పాఠశాలలు మూతబడుతాయి పేద వర్గాలకు చదువుకోవడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశాలు పాఠశాలలు దూరమవుతాయి.

మరోవైపు ప్రయివేటు పాఠశాలలకు నిబంధనలు విరుద్ధంగా ఉన్న వాటికి సైతం ప్రభుత్వం అనుమతులిస్తోంది.యతేచ్ఛగా ప్రయివేటు కార్పొరేట్ శక్తులు రాజ్యమేలుతున్నాయి
ప్రయివేటు కళాశాలలైన అనురాగ్ గురునానక్ పలు కళాశాలకు యూనివర్సిటీల గుర్తింపు కోసం ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రభుత్వ పాఠశాలలను కనీసం పట్టించుకోవడం లేదు అంటే ప్రయివేటు విద్యా సంస్థలపై ఉన్న సోయి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై లేదు కానీ మన ఊరు మన బడి అని పేరుకి మాత్రం బాగా ప్రచారం చేస్తూ భ్రమ కల్పిస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం పేద వర్గాలను మోసం చేస్తోంది.
టీచర్ పోస్టుల సంఖ్య పెరగాలి మినీ డి.ఎస్సి.కాదు మెగా డి.ఏస్సితో ప్రభుత్వం సరికొత్త నోటిఫికేషన్ వేయాలని DED మరియు BED అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి తెలిజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల వారిగా నిరసన ప్రదర్శనలు పలు కార్యక్రమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అత్యంత ముఖ్యమైన అంశంగా భావిస్తూ తక్షణమే అభ్యర్థులకు న్యాయం చేయాలి అని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

You may also like...

Translate »