నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షో లు.

నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షో లు.

హైదరాబాద్‌ నవంబర్‌ 08:
బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు.గత ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు.ఈ 20 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు మరో 14 నియోజకవర్గాల్లో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

వీటితోపాటు హైదరాబాద్‌ సహా పలు నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశమవుతారు.

మంత్రి కేటీఆర్‌ షెడ్యూల్‌:

8న సంగారెడ్డి నియోజకర్గంలో రోడ్‌షో బహిరంగ సభ

9న ఆర్మూర్‌ కొడంగల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో బహిరంగ సభ.

10న సిరిసిల్లలో నామినేషన్‌

11న జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌
అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం. శామీర్‌పేటలో ఎస్టీ సెల్‌ ప్రతినిధులతో భేటీ

15న కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షో

16న అంబర్‌పేట ముషీరాబాద్‌లో రోడ్‌షో

17న గోషామహల్‌ సికింద్రాబాద్‌లో రోడ్‌షో

18న జూబ్లీహిల్స్‌ ఖైరతాబాద్‌లో రోడ్‌షో

19న మెదక్‌ దుబ్బాక నియోజకవర్గాల్లో యువ సమ్మేళనం సనత్‌నగర్‌ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ లో రోడ్‌షో

20న ఎల్‌బీనగర్‌లో రోడ్‌షో

21న శేరిలింగంపల్లి రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో

22న మల్కాజ్‌గిరి ఉప్పల్‌లో రోడ్‌షో

23న కోరుట్ల నియోజకవర్గంలో రోడ్‌షో
బహిరంగసభ వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌ చందుర్తి మేడిపల్లి రుద్రంగి మండలాల్లో రోడ్‌షో

24న అచ్చంపేట మక్తల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో బహిరంగసభ

26న మంథని పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాల్లో రోడ్‌షో బహిరంగ సభ

27న ఖానాపూర్‌ చొప్పదండి నియోజకవర్గాల్లో రోడ్‌షో బహిరంగ సభ

28న వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో పాల్గొంటారు.

You may also like...

Translate »