ప్రవీణ్‌కుమార్‌ లాంటి వ్యక్తి మళ్లీ దొరకడు.ఎంపీగా గెలిపించండి

ప్రవీణ్‌కుమార్‌ లాంటి వ్యక్తి మళ్లీ దొరకడు.
ఎంపీగా గెలిపించండి

నాగర్ కర్నూల్ ప్రజలకు కేసీఆర్ పిలుపు

నాగర్‌ కర్నూల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంచిగా చదువుకున్న నాయకుడు,మంది విద్యావంతుడు మాజీ ఐపీఎస్‌ అధికారి. నాగర్‌కర్నూలు చిత్రపటాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టే నాయకుడు.

అలంపూర్‌లో పుట్టిన బిడ్డ. సొంతగడ్డ నాగర్ కర్నూల్ కు సేవ చేయాలని మీ ముందుకు వచ్చాడు.

మీరు బలాన్ని ఇస్తే ప్రవీణ్‌కుమార్‌తో సహా జిల్లా ముఖ్యనాయకులందరూ కలిసి ముఖ్యమంత్రి మెడలు వంచి అన్ని హామీలు అమలు చేయిస్తాం. ఆ శక్తిని, బలాన్ని మీరు అందించాలె.

నేను ముఖ్యమంత్రి అయినంక ప్రవీణ్‌కుమార్‌ను పిలిచి గురుకులాలను బాగా నడుపుతున్నారని చెప్పి, ఇంకా బాగా నడపాలని చెప్పా. బడ్జెట్‌ పెంచుకొమని చెప్పా.
గురుకులాను జూనియర్‌ కాలేజీలుగా చేయాలని చెప్పా. ఇప్పుడు తెలంగాణ గురుకులాలంటే అంతర్జాతీయ స్కూల్స్‌కు సమానం. అద్భుతమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐపీఎస్‌లు, పైలట్లు, ఎవరెస్టు శిఖరాలు ఎక్కిన బిడ్డలను తయారు చేసిండు. ఆయనకొక కమిట్‌మెంట్‌ ఉంది. దేశాన్ని బాగు చేయాలని ఉంది.

అట్టడుగు వర్గాలను పైకి తేవాలని, రైతులను కాపాడుకోవాలని, రాష్ర్టానికి మేలు చేయాలని ఉంది. ఆషామాషీ వ్యక్తి కాదు. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే మనందరికీ మేలు జరుగుతుంది.

ఇట్లాంటి వ్యక్తి మరోసారి దొరకరు. దయచేసి ఆలోచన చేయండి.

జై తెలంగాణ

You may also like...

Translate »