ఉన్నత అధికారులతో సిఎస్ శాంతి కుమారి గారు అత్యవసర భేటీ

తెలంగాణ సీ,ఎస్ శాంతికుమారి ఈరోజు అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
వచ్చేనెల మూడో తేదీ నుంచి సీఈసీ టీం నగరంలోనే ఉంటుందని తెలిపింది. కేంద్ర ఎన్నికల అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో పాటు సీనియర్ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించింది.
రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున వాటిపై అవగాహనా కలిగి ఉండాలని నిర్దేశించారు. పోలింగ్ కేంద్రలలో కనీస సౌకర్యాలు అందించేలా చూడాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు