ఇంద్రేశం మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 13 :ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత బుజంగారెడ్డి ఘన విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో సరిత బుజంగారెడ్డికి 439 ఓట్లు లభించగా,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒగ్గు సుమతికి 281 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో మూడు ఓట్లు రిజెక్ట్ కాగా, రెండు ఓట్లు నోటాకు నమోదయ్యాయి.దీంతో 158 ఓట్ల మెజార్టీతో సరిత బుజంగారెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ విజయంతో 15వ వార్డులో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.

You may also like...

Translate »