బీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్…

ఉపసర్పంచ్,మాజీ సర్పంచ్ లు తో పాటు వార్డ్ సభ్యులు బీఎస్పీ లోకి చేరిక…
రాష్ట్ర బీఎస్పీ పార్టీ ఉత్తర తెలంగాణ చేరికల కమిటీ అధ్యక్షుడు అర్షద్ హూషన్ ఆధ్వర్యంలో ఈరోజు దహెగం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ ఉపసర్పంచ్ ఎల్కారి ప్రశాంత్,చౌక సర్పంచ్ కి పోటి చేసిన అభ్యర్థి కంబాల రాజేష్, లగ్గాం మాజీ సర్పంచ్ ఏర్గటి రాజన్న , మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు మేకల మల్లేష్,బీఅర్ఎస్ వార్డ్ సభ్యులు నాగుల లక్ష్మి ,ఆదివాసి కొలవర్ సంఘం మండల నాయకురాలు రాజేశ్వరి తో పాటు పలు పార్టీల నాయకులు చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేస్తున్న అరాచకలు భరించలేక,బీఅర్ఎస్ పార్టీ కి అసంతృప్తి చెంది బిఎస్సి పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి బహుజన రాజ్యం రావాలని ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా పోటీ చేయడంతో మా అదృష్టంగా భావించి ప్రవీణ్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నే సిర్పూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని వైద్యరంగంలో, విద్యారంగంలో మెరుగైన ఫలితాలు ప్రజలకు అందుతాయని బలమైన నమ్మకం తో పార్టీలో చేరమన్నారు.
ఈ సారి డా ” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర పాలనకు చరమ గీతం పాడి,మన ప్రవీణ్ సార్ ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలౌతుందని ప్రాణం పెట్టి పని చేసి కోణప్పను తెలంగాణ నుండి తరిమి కొట్టడమే తమ ద్యేయమని అన్నారు.
తెలంగాణ లో లక్షలాది పేద బిడ్డలను గొప్ప గా చదివించి మా గడపకు వస్తున్న ప్రవీణ్ సార్ ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని వారు అన్నారు.
