ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం గ్రామ సెక్రెటరీ ని సంప్రదించండి

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం గ్రామ సెక్రెటరీ ని సంప్రదించండి


జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
శంకర్పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నూతన గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులు ఇసుక విషయంలో ఇబ్బంది పడవద్దని.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టోకెన్ ద్వారా మీకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని శంకర్పల్లి మండలం ఎంపీడీవో వి వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక కావలసిన లబ్ధిదారులు మీ మీ గ్రామాల్లో గల గ్రామ సెక్రెటరీ కి అర్జీ పెట్టుకోవాలని సూచించారు. గ్రామ సెక్రెటరీ వద్ద టోకన్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల్ల మేరకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.

You may also like...

Translate »