ఈ నెల 9 వ తేదీ నుండి అగ్రికల్చర్ గురుకులాల్లో ప్రవేశాలు

ఈ నెల 9 వ తేదీ నుండి అగ్రికల్చర్ గురుకులాల్లో ప్రవేశాలు : ఎంజేపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు గారు
బీసీ గురుకుల అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బీఎస్సీ (హానర్స్) కోర్సులో ప్రవేశాలకు 9 నుంచి అగ్రిసెట్ మొదటి విడత, ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఎంజేపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు తెలిపారు. అగ్రిసెట్ 2023లో వచ్చిన ర్యాంకుతోపాటు గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీ సీటు కోసం దరఖాస్తు చేసుకొన్న అమ్మాయిలే కౌన్సెలింగ్కు హాజరుకావాలని స్పష్టంచేశారు. కౌన్సెలింగ్ వివరాలు https://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్కు అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.