తెలంగాణ ఆర్డీసీ సెట్ నోటిఫికేషన్

తెలంగాణ ఆర్డీసీ సెట్ నోటిఫికేషన్

హైదరాబాదులోని మహాత్మ జ్యోతిరావు పూలే తెలం గాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ ఆర్డీసీ సెట్) 2024 నోటి ఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాలు, తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకులాలు, తెలం గాణ గిరిజన సంక్షేమ గురుకు లాల్లో అడ్మిషన్స్ ఇస్తారు. బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఏ, బీఎఫ్, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సులు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. బోధన, వసతి ఉచితం.

డిగ్రీ గురుకులాల వివరాలు:

• మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో పురుషులకు 15 కళాశాలలు, మహిళలకు 15 కళాశాలలు ఉన్నాయి.తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకులాల్లో మహిళలకు 26 కళాశాలలు ఉన్నాయి.

• తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో పురుషులకు ఆరు కళాశాలలు, మహిళలకు 15 కళాశాలలు ఉన్నాయి.

అర్హత: ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసు కోవచ్చు. మొత్తమ్మీద కనీసం 50 శాతం మార్కులు ఇన్ స్టంట్ ఎగ్జామ్ అభ్యర్థులు అనర్హులు, కుటుంబ వార్షికాదాయం నగరాల్లో రూ.2,00,000లు; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000లు మించకూడదు.

టీఎస్ ఆర్ డీసీ సెట్ వివరాలు:

పరీక్ష సమయం రెండున్నర గంటలు, అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఇస్తారు. మొత్తం మార్కులు 150. అభ్యర్థి ఎంచుకొన్న కోర్సుకు నిర్దేశించిన మూడు సబ్జెక్టు లలో ఒక్కోదానిలో 40 మార్కులకు, ఇంగ్లీష్ లో 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. బీబీఏ, బీకాం(జన రల్ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్) కోర్సు లకు మాత్రం ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టు లనుంచి ఒక్కోదానిలో 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్ సిలబస్ ప్రకారమే ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగు మాధ్య మాల్లో ఉంటుంది. ఓఎంఆర్ పత్రం మీద సమాధా నాలు గుర్తించాలి. నెగెటివ్ మార్కులు లేవు.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు ఫీజు: రూ.200

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12

హాల్ టికెట్స్ డౌన్ లోడింగ్: ఏప్రిల్ 21 నుంచి

టీఎస్ఆర్డీసీ సెట్ 2024 తేదీ: ఏప్రిల్ 28

Website: tsrdccet.cgg.gov.in

You may also like...

Translate »