స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి
బీసీ కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/ కొత్తగూడెం న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిందన్నారు.విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాలలో బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుంచి 50 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారన్నారు.కానీ ప్రభుత్వం కులగణన అంశాన్ని,రిజర్వేషన్ పెంపును పరిగణనలోకి తీసుకోకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రాతపదికన పెంచే ప్రక్రియ చేపట్టాలని దానికనుగుణంగా నిధులు కేటాయించాలని కోరారు.బీసీ లంతా పార్టీలకు,కులాలకు అతీతంగా ఏకమై బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలనే ఆలోచన విరమించుకోవాలని,బీసీ కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో వంగా రవిశంకర్,సందేల సందీప్,తాటిపాముల హరికృష్ణ,సమీర్,మురళి తదితరులు పాల్గొన్నారు
