బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం : పూజల హరికృష్ణ.
బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం : పూజల హరికృష్ణ.

33 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుంది.
ఇదే స్ఫూర్తితో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపిద్దాం.* బిఆర్ఎస్ నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ లో చేరిన నాయకులు.*జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది ఏప్రిల్ 29.*మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేశారని అందుకు దేవుడు వరమిచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉంటున్నాయని రాబోయే రోజుల్లో త్వరలోనే బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమాములు అన్నారు. సిద్ధిపేట పట్టణంలోని రెండవ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో పూజల హరికృష్ణ అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కనిపిస్తుందని అన్నారు. సిద్దిపేటలో మదన్మోహన్ తర్వాత కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని నాయకులు కార్యకర్తలు ఉన్నారని వారందరి కోసం సిద్దిపేటలో నియోజకవర్గ ఇన్చార్జిగా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నదని అన్నారు.కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని. సిద్దిపేట క్యాంపు కార్యాలయానికి ప్రజలు వివిధ అధికారులు వచ్చి సమస్యలు విన్నవించుకుంటున్నారని వాటన్నిటిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకొని సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇద్దామని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు చిత్త శుద్ధితో పనిచేసి ఇదే స్ఫూర్తిని పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగిద్దామని. నాయకులకు కార్యకర్తలకు అండగా ఎల్లప్పుడూ సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, దేవులపల్లి యాదగిరి, మార్క సతీష్ గౌడ్, తప్పేట శంకర్, రెండో వార్డ్ అధ్యక్షులు నాయిని సాయి మల్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి, కౌన్సిలర్స్ బుచ్చిరెడ్డి, సాకి ఆనంద్, రెండో వార్డు ఇంచార్జ్ కుమార్. శ్రీనివాస్ గౌడ్, రాజ్ బహదూర్. సాంబమూర్తి నాయిని నరసింహారెడ్డి కలేమ్ముద్దీన్, వహీద్ ఖాన్, చంద్ వహాబ్ గయాజుద్దీన్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.