హెడ్డింగ్: వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
హెడ్డింగ్: వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
జ్ఞాన తెలంగాణ న్యూస్ //వికారాబాద్ జిల్లా//నవా బుపేట్ మండలం //ఏప్రిల్ 23.

నవాబుపేట్ మండలం మాదిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య (57) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడ దెబ్బతో మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కిష్టయ్యకు నలుగురు ఆడపిల్లలు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.