ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించాం

ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించాం
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించి మాట నిలబెట్టుకున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 3,69,200 మంది ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షనర్లకు ఫిబ్రవరికి సంబంధించిన జీతాలను చెల్లించినట్లు వెల్లడించింది. ఇలా చివరిసారిగా 2019లో అక్టోబర్ ఒకటో తేదీన చెల్లించారని పేర్కొంది. గత నెలలో 7వ తేదీలోపు చెల్లింపులు పూర్తిచేసినట్లు తెలిపింది.