టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళి గారి నియమించాలని: విద్యార్థి సంఘాలు.

టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళి గారి నియమించాలని: విద్యార్థి సంఘాలు.
అకునూరి మురళి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.గతంలో పలుమార్లు పేపర్ లీకేజీల కారణంగా పలుమార్లు వివిధ పరీక్షలను రద్దుచేసి 30 లక్షల నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని బొంద పెట్టి కాంగ్రెస్కు పట్టం కట్టింది. తమ సమస్యలను తీరుస్తారని కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ని ఇంకా నియమించకపోవడం పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగుల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, పరీక్షల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ఆకునూరి మురళి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తే తమకు సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.ఈ క్రమంలో త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వాలని నిరుద్యోగులు భావిస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ లండన్ పర్యటన ముగించుకొని నేడు హైదరాబాద్ చేరుకున్నారు. కావున త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలుసుకొని తమ యొక్క డిమాండ్ ను బలంగా వినిపించాలనీ భావిస్తున్నట్టు స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ మొగిలి పాక నవీన్ గారు తెలిపారు,తమతో కలిసి వచ్చేటటువంటి విద్యార్థి సంఘాలను కలుపుకొని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నట్టు వారు తెలిపారు.