కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మొకు మోటార్ బైకులు ఇవ్వాలికల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు కొండ వెంకన్న….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ప్రమాదాల నివారణకు సేఫ్టీమోగులు అలాగే తాటి ఈత వనాలకు పోవడానికి మోటారు బైకులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు తప్ప ఆచరణలో ఇవ్వడం లేదని తక్షణమే కల్లుగీత సొసైటీలలో TFT లలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ మోటారు బైకులు సేఫ్టీమోకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్నడిమాండ్ చేశారు.
ఈరోజు నల్గొండ జిల్లా మండల మునుగోడు గ్రామం.చీకటి మామిడి లో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.ఉప్పల గోపాల్అధ్యక్షతన సమావేశం జరగగా ఈకార్యక్రమానికి కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు కొండా వెంకన్న. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కల్లుగీత వృత్తికి ప్రభుత్వ ఆదరణ లేకపోవటం వల్ల రోజు రోజుకు తగ్గిపోతున్నదని కొత్త తరం ఈవృత్తిలోకి రావడం లేదని తరతరాలుగా కొనసాగుతున్న వృత్తి కొద్ది రోజులలో అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత వృత్తిని ఆధునికరించి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నీరా ఉత్పత్తుల తాటి ఉత్పత్తుల కేంద్రాలను నెలకొల్పి కల్లుగీత నిరుగ్యగ యువతను మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణను ఇచ్చి కల్లుగీతను పరిశ్రమగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.అలాగే శాస్త్రజ్ఞుల ద్వారా పరిశోధన చేసి పొట్టి జాతి తాటి ఈత వనాలను పెంచాలని ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి కొని ఇవ్వాలని కల్లుగీత కార్మికులకు ఇస్తున్న పెన్షన్ 2000 నుంచి 5 వేలకు పెంచాలని గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గీతకార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న హైదరాబాదులో జరిగే మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
కరటి దశరథ .భిక్షం”యాదగిరి అంజయ్య లక్ష్మీపతి లింగయ్య శీను అంజయ్య సాయిలు లక్ష్మమ్మ స్వాతి.హలో గీతన్న చలో హైదరాబాద్” గోడ పత్రికలను ఆవిష్కరించారు…. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
