మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు

మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు – జడ్చర్ల ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనంగా మారిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆసుపత్రి మార్చురీలో భద్రతా లోపాల కారణంగా ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు బయటకు రావడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ అమానుష ఘటన వైద్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది.
మార్చురీ భద్రత, నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోలను సస్పెండ్ చేసింది.
వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్చురీ భద్రతను బలోపేతం చేయాలని సూచించారు.
మృతదేహానికి కూడా గౌరవం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటంపై ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
