చేవెళ్లలో రోడ్డు ప్రమాదం-టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం – టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:
చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టిప్పర్ లారీ బ్రిజా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఢీకొన్న దెబ్బకు కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియరాలేదు. అతివేగం లేదా నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

You may also like...

Translate »