మహిళ దారుణ హత్య- బంగారం కోసం గొంతు కోసి హత్య

మహిళ దారుణ హత్య – బంగారం కోసం గొంతు కోసి హత్య


జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్,మార్చి 3:
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం, మహిళను గొంతు కోసి హత్య చేసినట్లు వెల్లడైంది.
మృతురాలి వద్ద ఉన్న సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించి పరారైనట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతురాలు నవాబుపేట మండలం ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణి గా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

You may also like...

Translate »