ఎన్నికల సంఘం నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ

  • కేంద్రమే దేశవ్యాప్తంగా కుల గణన చేస్తే చిక్కులే ఉండవు
  • ఆపరేషన్ కగారిపై హోం మంత్రి వ్యాఖ్యలు సరికాదు
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం :

బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు రెండు వారాల గడువు స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు.గురువారం శంకరపట్నం మండలం సిపిఐ మండల శాఖ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాజీవ్ గాంధీ 94 లో తీసుకొచ్చిన చట్టాన్ని కొంతమంది తూట్లు పొడవడంతో పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉండటంతో గ్రామపంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు, శాసనసభకు ప్రతి ఐదేన్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయని స్థానిక సంస్థలకు మాత్రం పదవి కాలం ముగిసి ఏళ్లు గడుస్తున్న ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రం అన్ని కులాలకు రిజర్వేషన్ ప్రాధాన్యత కల్పించేందుకు కులగనన చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేయగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొందని కేంద్రమే కులగనన చేపడితే ఈ సమస్య ఉండేది కాదన్నారు. బలమున్నచోట తాము అభ్యర్థులను నిలబెట్టి స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో ఉంటామని పేర్కొన్నారు.
అంబానీ, ఆదానిలు ప్రపంచ ధనవంతుల్లో అగ్రగామిగా ఉన్నారని దేశంలో సామాన్యులు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూడు గూడు గుడ్డ కల్పించాలని ఉద్యమిస్తున్న ప్రశ్నించే గొంతుకలైన వామపక్ష నాయకులను మోడీ అనుచివేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులు తుపాకులు వీడి చర్చలకు వస్తామని ప్రకటించిన కేంద్రమంత్రి మావోయిస్టులను అంతమొందించేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బత్తుల బాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, హుజురాబాద్, సైదాపూర్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కార్యదర్శి గోవిందుల రవి, లంక దాసరి కళ్యాణ్, గజ్జి బాలయ్య, రామ్ గోపాల్, రత్నాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారాపు వెంకటేష్,ఉపాధ్యక్షుడు సాగర్, రాము, సిపిఐ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »