బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు పరిశీలించిన సీపీ

బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు పరిశీలించిన సీపీ
జ్ఞాన తెలంగాణ – బోధన్ :
బోధన్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రను పోలీస్ కమీషనర్ సాయిచైతన్య పరిశీలించారు.బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తమ విధుల పట్ల నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని అన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఎలాంటి సమాచారం తెలిసిన పై స్థాయి అధికారులకు సమాచారమివ్వాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బందోబస్తులో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలందరూ సంబంధిత పోలీసు అధికారులకు , ట్రాఫిక్ సిబ్బందికి సహకరించగలరని అన్నారు.అనంతరము సార్వజనిక్ ఉత్సవ కమిటీ అద్వర్యంలో గల దుర్గామాత విగ్రహాన్ని దర్శించుకున్నారు.
ఆయన వెంట బోధన్ ఎసిపి శ్రీ శ్రీనివాస్ , బోధన్ సీఐ వెంకట్ నారాయణ తదితరులు ఉన్నారు.
