త్రిశూల్ పహాడ్‌పై అమ్మవారిని దర్శించిన BRS జనరల్ సెక్రెటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞానతెలంగాణ,కాగజ్‌నగర్ :

విజయదశమి సందర్భంగా కాగజ్‌నగర్‌లోని త్రిశూల్ పహాడ్‌పై ఉన్న అమ్మవారి ఆలయాన్ని BRS జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దర్శించారు.డాక్టర్ ప్రవీణ్ కుమార్ పూజలు చేసి, సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థించారు. “అమ్మవారి కృపతో ప్రజలు విజయం సాధించాలని” కోరుకున్నారు. BRS పార్టీ మత సామరస్యం, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.దసరా సందర్భంగా పట్టణంలో రామలీలలు, భజనలు అద్భుతంగా జరిగాయి. ఈ ఉత్సవాలు ప్రజల్లో ఆధ్యాత్మికత, సామరస్యాన్ని పెంచాయి.

ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో నాయకులు కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేష్, కాశీపాక రాజు, తన్నీరు పోచమ్, బండి వాసు, జాక్, వెంకటేష్, శివ, శోభన్, అమన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

You may also like...

Translate »