నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకపెట్ లో హత్య కలకలం

  • కోకాపేట్ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ వద్ద ఘటన
  • కత్తితో విచక్షణారహితంగా పొడిచిన స్నేహితులు

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 30: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కో కాపేట్ లో హత్య కలకలం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేట్ లో హత్య జరిగినట్టు తెలిపారు. కోకాపేట్ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ వద్ద యాదగిరి అనే వ్యక్తిని హత్య చేసినట్లు తన స్నేహితులైన అప్రోచ్ నవాజులు కలిసి ఈ దారునానికి పొడిగట్టిన తెలిపారు. రాత్రి సమయంలో మద్యం సేవించిన ముగ్గురు చిన్న విషయంలో యాదగిరి తో గొడవకు దిగిన తరుణంలో మాటామాటా పెరిగి కత్తితో విచక్షణ రహితంగా తన స్నేహితుడు పొడవడం జరిగిందని తెలిపారు. యాదగిరి అరుపులు విని 100 కి ఫోన్ చేసిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు తెలిపారు.

You may also like...

Translate »