ఘనంగా శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి సందర్భంగా.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ,
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంఎల్ఏ దానం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు. వార్త సిఎండి డా.గిరీష్ కుమార్ సంఘీ, అల్కా సంఘీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వార్త ఈడి గౌరవ్ సంఘీ తదితరులు శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

