బిజినాపల్లి మండలంలో యూరియా కోసం తోపులాట – మహిళా రైతు పుస్తే మాయం

- బిజినాపల్లి మండలంలో యూరియా కోసం తోపులాట – మహిళా రైతు పుస్తే మాయం
బిజినాపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా):
వానాకాలం పంటల దశలో రైతులు అత్యవసరంగా కోరుకునే యూరియా ఎరువుల కొరత మళ్లీ బయటపడింది. సోమవారం ఉదయం బిజినాపల్లి మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరడంతో క్యూల్లో తోపులాట జరిగింది. ఈ ఘటనలో వెల్గొండతాండ గ్రామానికి చెందిన మహిళా రైతు రామావత్ లలిత దగ్గర ఉన్న (రెండింటిలో ఒకటి) పుస్తే బిల్లా ఒకటి పోయింది.
ఉదయం తొలిగంటల నుంచే కార్యాలయం ముందు రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడ్డారు. సరఫరా ఆలస్యమవ్వడం, టోకెన్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆత్రుతతో ముందుకు జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పుస్తకం పోయిన ఘటనపై లలిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
“రోజంతా క్యూలో నిలబడి చివరికి ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం చాలా బాధాకరం” అని ఆమె వ్యాఖ్యానించారు. ఎరువుల కొరతతో పంటలు దెబ్బతింటాయని, రైతుల పరిస్థితి మరింత కష్టమవుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది ఇదే సమస్య తలెత్తుతుందని, కానీ అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. గ్రామాల్లోనే పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి తోపులాటలు తప్పవని వారు సూచించారు.
క్యూల్లో తోపులాటలు, రైతుల అవస్థలు – ఇవన్నీ వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న సమస్యలకు నిదర్శనం కావడం విశేషం.