ఇలాగుంటే బడికెలా వెళ్ళేది

ఇలాగుంటే బడికెలా వెళ్ళేది
బడిబాట సరే- బడిలోని సమస్యలు ఎలా?
ప్రభుత్వ పాఠశాల నిర్వహణపై పేరుకే ఆర్బాటాలు.
సమస్యల వలయంలో చేవెళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు.
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 12
ప్రభుత్వం పాఠశాలలోని మౌలిక వసతులు త్రాగునీరు మరుగుదొడ్లు స్కూల్ ఆవరణ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టి స్కూల్ ప్రారంభానికి ముందే పనులు పూర్తి చెయ్యాలని ఆదేశాలు జారీ చేసినప్పటికి అధికారులు మాకేమి పట్టింపులేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రతి ఏటా 6నుండి 10 తరగతి వరకు చదివే సుమారు 350 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో విద్యార్థుల సమస్యలతో సతమతమవుతున్నారు.
తరగతిగది ఆనుకొని మొలిచిన పిచ్చి మొక్కలతో దోమలు తరగతి గదుల్లో వీర విహారం చేస్తుంటాయి , మరుగుదొడ్లు మూత్రశాలలు నిండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతు కంపు గొడుతున్నాయి.అసలే వర్షాకాలం దోమలతో మలేరియా టైఫాయిడ్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రభలే ప్రమాదం పొంచి ఉంది. పాఠశాలలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.విద్యార్థులు త్రాగే,త్రాగునీటి ట్యాంక్ శుభ్రం చేయకుండానే యధావిధిగా కొనసాగించారు .
ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల సమస్యలపై దృష్టి పెట్టాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారి చేస్తున్నప్పటికి కింది స్థాయి అధికారులు లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమస్యలపై చిన్న చూపు
చూస్తున్న అధికారులపై. కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.( కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లు విద్యార్థులకు అందుబాటులకు రాలేవు )