ఘనపూర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం..

జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్

ఘనపూర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం

కడియం.శ్రీహరి ఎమ్మెల్యే


ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రము లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం లో కడియం.శ్రీహరి ప్రసంగించారు.
ఈ సందర్భంగా
పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు.
లోక్ సభ ఎన్నికల సందర్బంగా కొంత మంది సభ్యత సంస్కారం లేకుండా కడియం కావ్య పై స్థాయిని నీచమైన ఆరోపణలు చేశారు
ప్రజలు చాలా గొప్ప వారు
ప్రజల చెతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉంది
ప్రజలు అసత్య ఆరోపణలు పట్టించుకోలేదు
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీ అందించారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరిగింది
పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగింది.
దేశంలో బీజేపీ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గింది
ఎన్డిఏ కూటమి ఓటింగ్ శాతం తగ్గితే ఇండియా కూటమి ఓటింగ్ శాతం పెరిగింది
దేశ ప్రజలు మోడీ విశ్వసించడం లేడు
భక్తి వేరు రాజకీయాలు వేరు అని ప్రజలు తీర్పు ఇచ్చారు
రాబోయే రోజులలో ఇండియా కూటమిదే అధికారం, రాహుల్ గాంధీ గారే ప్రధాన మంత్రి.
బీజేపీ ప్రభుత్వం స్థిరత్వంలేదు
కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది
కేసీఆర్ అవగాహన రాహిత్యం ఏంటో బయట పడింది
ఒక్క సిటు కూడా గెలవని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు హాస్యాస్పదం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటాను .
నియోజకవర్గ అభివృద్దె నా లక్ష్యం అందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా
ఈ నెల 12న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది
మడికొండ సత్య సాయి కన్వెన్షన్ లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం
ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొననున్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

You may also like...

Translate »