గెలుపు కన్నా క్రీడలలో పాల్గొనడం చాలా ముఖ్యం.

గెలుపు కన్నా క్రీడలలో పాల్గొనడం చాలా ముఖ్యం.

  • క్రీడలలో ప్రతి ఒక ఓటమే గెలుపునకు నాంది.
  • ఓటములే, జీవిత పాఠాన్ని నేర్పుతాయి1
  • జిల్లా ఎస్పీ శ్రీ కే.నారాయణ రెడ్డి,IPS.

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి /కృష్ణ గౌడ్ :

జిల్లా ఎస్పీ శ్రీ కే . నారాయణ రెడ్డి, IPS గారు ఈ రోజు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ ల స్పోర్ట్ మీట్ ముగింపు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ లకు వాలీబాల్, టాగ్ అఫ్ వార్, 100 మిటర్స్, 200 మిటర్స్, క్రికెట్ మొదలగు క్రీడలలో పోటీలు పెట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డి‌టి‌సి ప్రిన్సిపాల్ మురళీధర్ మీరందరికి మంచి శిక్షణను అంధించడం జరుగుతుంది. గెలుపు కన్నా స్పొర్ట్స్ లలో పాల్గొనడం చాలా ముఖ్యం, జీవితం కూడా ఒక క్రీడా లాంటిదే, క్రీడలలో ప్రతి ఓటమి, జీవిత పాఠాన్ని నేర్పుతుంది. జీవితం లో ఏవిధంగా విజయం సాదించాలి అనేది ఓటమి నుండే తెలుస్తుంది. క్రీడలు ఆడడం వలన శారీరకంగానూ, మానసికంగానే కాకుండా భవిష్యత్తులోకూడా ఆరోగ్యంగా ఉంచడం లో, సంతోషకరమైన కమ్యూనిటీని నిర్మించడంలో, జీవితంలో క్రమశిక్షణ గా ఉండుటలో క్రీడలు ఎంతోగానో ఉపయోగపడుతాయి. జీవితం లో వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని విజయం సాదించాలి అంటే ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కావున ఆరోగ్యంగా ఉండుటకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఏదో ఒక క్రీడలో తప్పని సరిగా పాల్గొనాలని, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారులు రిటైర్మెంట్ వరకు ఫీట్ గా ఉండటం కొరకు క్రీడలు,వ్యాయామం చాలా ఉపయోగపడుతాయి కావున ప్రతి ఒక్కరూ తమ రోజువారీ కార్యక్రమాలలో క్రీడలకు, వ్యాయామానికి ప్రముక్యత కల్గించలని ఎస్పీ తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో గెలుపొందిన వారికి జిల్లా ఎస్పీ అభినందించి వారికి మెమంటోలు అందించడం జరిగింది.డి‌టి‌సి నందు శిక్షణ ఇస్తున్న ప్రతి ఒక్కరికీ జిల్లా ఎస్పీ గారు అభినందించి మేమంటో లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో డి‌టి‌సి ప్రిన్సిపాల్ మురళీధర్ ,జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి , డి‌టి‌సి డి‌ఎస్‌పి విజయ్ కుమార్ , ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేశ్ , సి‌ఎల్‌ఐ , ఇన్స్పెక్టర్ లు ,ఆర్‌ఐ లు , ఎస్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు తదితరులు పాల్గొనడం జరిగింది.

  1. ↩︎

You may also like...

Translate »