రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట?


బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు.బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తు న్న కవిత శనివారం నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా రు.

ప్రజలు కోరుకుంటే తప్ప కుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు.అయితే పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం తెలంగాణ జాగృతి సామా జిక సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని స్పష్టం చేశారు.

రాజకీయాల గురించి మాట్లాడాలంటే రాజకీయ తెలంగాణ జాగృతి రాజకీ య పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు.ఒక వేళ తననుంచి పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తానన్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఆంధ్రలో మూడు,తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, కేరళలో అయితే గల్లీకి ఒక పార్టీ ఉందని గుర్తుచేశారు.

You may also like...

Translate »