రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం

గ్రోమోర్ షాపులో ఎరువుల నిల్వ,అమ్మకాలపై నమోదు వివరాలను చెక్ చేసిన కలెక్టర్


జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ :

రైతులకు సకాలంలో ఎరువులు అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు,పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మన గ్రోమోర్ షాప్ లో శుక్రవారం ఉదయం యూరియా,ఎరువు మందుల నిల్వలు.అమ్మకాలు ఈ పాస్ యంత్రంలో నమోదు వివరాలు చెక్ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల ఎరువుల విక్రయ కేంద్రాలకు ఎరువుల విక్రయ కేంద్రాల నిర్వహకులు ప్రతిరోజు సమయపాలన రైతులకు అందించాలని సూచించారు.
పంటకు అవసరమైన ఎరువు నిల్వలు ఉన్నాయి కాబట్టి రైతులకు ప్రస్తుతం అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు కొనుక్కోవాలని మున్సిపాలిటీలోని కిసాన్ జంక్షన్ ఫర్టిలైజర్ షాపు, శ్రీరంగాపూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం,గోదామును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.దుకాణాల బయట రాసిపెట్టిన ఎరువు నిలువలను,షాపు, గోదాములో ఉన్న నిలువలను పరిశీలించారు.
యూరియా నిలువలు, డి. ఎ.పి నిలువలు ఆన్లైన్ లో నిక్షిప్తం ఉన్న నిల్వలతో సరిపోల్చి చూసారు. యూరియా 45 కిలోల బస్తాలు రూ. 266 చొప్పున, నానో యూరియా డబ్బా కు రూ. 265 చొప్పున అమ్ముతున్నట్లు ఫర్టిలైజర్ దుకాణం దారు వివరించారు.

స్పందించిన కలెక్టర్ ఎరువులు యం.ఆర్.పి ధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు ఉంటాయని చెప్పారు. రైతులకు అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు ఇవ్వాలని అవసరానికి మించి ఇచ్చి కృత్రిమ కొరత సృష్టించవద్దని హెచ్చరించారు.నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు .
ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయాలని, ధరలను పర్యవేక్షించాలని కలెక్టర్ వ్యవసాయధికారికి సూచించారు. అన్ని ఎరువుల దుకాణాల బయట నిలువ, ధరల సూచిక బోర్డు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఎపి, యూరియా, జిప్సం, ఫాస్పరస్ వంటి ఎరువుల వివరాలు సూచిక బోర్డుపై ఉండాలని చెప్పారు.

You may also like...

Translate »