పశువుల తరలింపుపై ప్రత్యేక దృష్టి

అక్రమ రవాణా అడ్డుకట్టకు చెక్ పోస్ట్ లు


జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :
మండలంలోని పశువుల అక్రమ తరలింపుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది,వరుసగా పలు పండుగలు ఉన్న క్రమంలో పశువులను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు వేస్తున్న ఎత్తులను పసిగట్టి..ఆ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది, పశుసంవర్ధన శాఖతో కలిసి పోలీస్ అధికారులు పెబ్బేర్ మండల అంతర్గత రహదారులపై కొల్లాపూర్ కమాన్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు,ఆ చెక్ పోస్ట్ వద్ద నిరంతర తనిఖీలు చేస్తూ పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతూ పట్టుబడిన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు పశువులను సమీప గోశాలకు తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు,కాగా సోమవారం కొల్లాపూర్ కమాన్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేపడుతున్న క్రమంలో మహేంద్ర బుల్లోరా వాహనం ఏపీ 39 టి ఎన్ 9746 లో మూడు ఎద్దులను బుల్లోరాలో ఇరుకుగా తరలించి బంధించి హింసిస్తూ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నందికొట్కూర్ సంత నుండి పశువులను తరలిస్తున్న,వనపర్తి జిల్లా పానగల్ మండలం మల్లా యపల్లి గ్రామానికి చెందిన మద్దిలేటి,దేవర్ల బుచ్చన్న పై పెబ్బేర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి తెలిపారు,ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మూగజీవులను వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

You may also like...

Translate »