వనపర్తి డిఇఓ పైన చర్యలు తీసుకోవాలి

మానాజీ పేట రమేష్ గౌడ్,తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి


జ్ఞాన తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి, జూలై 1:

స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ని సోమవారం వారి కార్యాలయంలో తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కలవడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…వనపర్తి డి.ఇ.ఓ పైన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్స్ లో విచ్చల విడిగా బుక్స్ మరియు స్కూల్లో ముందర టెక్నో టాలెంట్ గ్రామర్ అని భవన నిర్మాణంలో ఉన్నపుడు విద్యార్థులను ప్రైవేటు స్కూల్ యాజమాన్యం కింద అదే కూర్చోబెట్టి చదివించడం జరిగింది.ఎన్నిసార్లు చెప్పినా డీ.ఈ.ఓ పట్టించుకోకపోవడంతో సోమవారం డైరెక్టర్ ని కలిసి డి.ఈ.ఓ పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.వారు వెంటనే స్పందించిన డైరెక్టర్ నవీన్ నికోలస్ ఐ.ఏ.ఎస్ జిల్లా కలెక్టర్ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకొని తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్మి నివాస్, విద్యార్థితెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెస్త యాదగిరి,రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »