పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ


జ్ఞాన తెలంగాణ, పరిగి:
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 216లో ఉన్న భూమిలో దారి విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన శ్రీనివాస్, దీపక్, వెంకటేశ్‌లకు తలపై గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరో వర్గానికి చెందిన కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఇరువర్గాలు కూడా పరిగి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భూమి విషయంలో గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య తగాదాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇప్పటికే ఒకరిపై ఒకరు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, భూ సమస్యకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని సమాచారం. దారి విషయంలో నెలకొన్న వివాదమే తాజా ఘర్షణకు కారణమైందని తెలుస్తోంది.

You may also like...

Translate »