ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం !

జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :
2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి అఖిల్ (485), పుల్లూరు గణేష్ (440), సారగుండ్ల శరత్ (435), కాలేజీ బ్యాగ్స్ అందించి,శాలువాతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించారు.

విద్యార్థులు ఇక్కడితో ఆగకుండా ఉన్నత విద్యను అభ్యసించి మిగతా వాళ్లకు ఆదర్శనంగా నిలవాలన్నారు. వివిధ ప్రభుత్వ పాఠశాల నుండి ఇంత గొప్ప మార్కులు సాధించడం సంతొషంగా ఉందన్నారు.
విద్యార్థులు ప్రతిభ చాటడానికి కృషిచేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియచేశారు.
గ్రామ పాఠశాల అభివృద్ది, మరియు విద్యను ప్రొత్సహించడం కోసం తాను, మరియు స్వేరో నాయకులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సంధర్భంగా తెలియచేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న పుల్లూరు లెనిన్, మట్టే మధు, కాకి లింగ రెడ్డి, సారగుండ్ల లక్ష్మణ్, పుల్లూరు అఖిల్, మట్టే విష్ణు తదితరులు..

You may also like...

Translate »