దుస్తులు పంపిణీ చేసిన ప్రిథ్వీరాజ్

జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు:

దసరా పండుగ సందర్భంగా ఆశా వర్కర్లకు, పూజారులకు దుస్తులు పంపిణీ చేసిన మాదిరి ప్రిథ్వీరాజ్
పటాన్చెరువు డివిజన్ పరిధిలో నిత్యం క్షమిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు, అలాగే భక్తుడికి దేవుడికి మధ్య వారధిగా నిలుస్తూ నిరంతరం సేవలందిస్తున్న పూజారులకు దసరా పండుగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేసిన, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి ప్రిథ్వీరాజ్, ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ “గర్భిణీ స్త్రీల పౌష్టికాహార లోపం లేకుండా ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను ఆశా వర్కర్లు నిత్యం చేరవేస్తున్నారు. అదే విధంగా పూజారులు తమ కుటుంబంతో కలసి దేవుడి సేవలో జీవితాన్ని అంకితం చేస్తున్నారు. వీరందరికీ దసరా పండుగ సందర్భంగా కొత్త దుస్తులు అందజేయడం ఆనందంగా ఉందనీ నిరంతరం ప్రజాసేవలో ఎండిఆర్ ఫౌండేషన్ ముందు ఉంటుందని ప్రిథ్వీరాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »