హత్నూర లో యూరియా సంచుల కోసం రైతుల ఆందోళనలు

- హత్నూర కోఆపరేట్ సొసైటీ వద్ద యూరియా బస్థలకోసం రైతుల ఆందోళనలు
- ఒక్కో టోకెన్ కి రెండు మూడు సంచులు తీసుకుంటున్నారని రైతుల ఆరోపణలు
- కోఆపరేటివ్ సొసైటీ వద్ద ఉద్రికత
- పరిస్థితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు
జ్ఞాన తెలంగాణ, హత్నూర ప్రతినిధి :
హత్నూర లోని కొన్యాల, పన్యాల గేట్ దగ్గర గల కూపరేటివ్ సోసైటీ వద్ద రైతులు యూరియా బస్థల కోసం ఆందోళనలు చేశారు ఉదయం నుంచి గంటల పాటు పడిగాపులు కస్తూ ఆధార్ కార్డు తో క్యూ లో నిల్చొని ఒక్క ఆధార్ కార్డు కు ఒక యూరియా బస్తా మాత్రమే కొనుగోలు చేస్తే కొంతంది తెల్ల కాగితాలపై స్టాంప్ గుర్తులు(టోకెన్) చూపించి రెండు మూడు సంచులు తీసుకుంటున్నారని అక్కడి రైతులు ఆరోపించారు , కోఆపరేటివ్ సొసైటీ దగ్గర రైతులు ఉదృక్తంగ ఉండడం వలన అక్కడి పరిస్థితులను పోలీసులు అదుపులోకి తోసుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళనను అదుపు చేసారు
పంటలకు సరిపడా యూరియా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని అక్కడి రైతులు ప్రభుత్వాని కోరారు

