కళాకారుడు కొమ్ముల శేఖర్ గౌడ్ ను పరామర్శించిన జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు

తెలంగాణ సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కళాకారుడైన కొమ్ముల శేఖర్ గౌడ్ అనారోగ్యం తో సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని సారథి జిల్లా టీమ్ లీడర్ అయిదాల సునీల్ ద్వారా తెలుసుకుని వెంటనే పరామర్శించారు. శేఖర్ గౌడ్ అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. కళాకారులు విది నిర్వహణలో జాగ్రత్తగా ప్రయాణాలు చెయ్యాలని, తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రభుత్వం ద్వారా కల్పించాల్సిన సహాయసహకారాలు అందిస్తామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. పరామర్శించినవారిలో డిపిఆర్ఓ తో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అయిదాల సునీల్ ఉన్నారు.

You may also like...

Translate »