మహిళ సాధికారతకు ..డిజిటల్ మహిళా సంఘం కొత్త అడుగు

- స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక గా ముందడుగు
- మహిళల ప్రతిభను అభినందించిన కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి
రామచంద్రాపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ):
రామచంద్రపురం డివిజన్లోని కాకతీయ నగర్‌లో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో సమృద్ధి డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, సంఘ సభ్యులతో పరస్పరంగా చర్చించారు. ఈ సందర్భంగా..ఆమె మాట్లాడుతూ,
మహిళా సాధికారతే సమాజాభివృద్ధికి మూలాధారం అని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తెలిపారు. మహిళలు డిజిటల్ రంగంలో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడుతూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల కలల్ని నిజం చేసుకునే వేదికగా “సమృద్ధి డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమం” నిలుస్తుందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో డిజిటల్ మహిళా సంఘం అధ్యక్షురాలు రామ శ్రీనివాస్,కార్యదర్శి సీతా లక్ష్మి, ఖజానా అధికారి అనిత.ఎం, గ్రోత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంతి చందా, ట్రైనింగ్ ఆఫీసర్ కట్ట సుజిత, బీఆర్‌ఎస్ మహిళా సర్కిల్ సెక్రటరీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
