గడ్డపోతారం మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బిఆర్ఎస్..

– ఫలించిన బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి కృషి


జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 13 :

పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 18 వార్డులకు గానూ జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.దీంతో మున్సిపల్ పాలక మండలిపై బీఆర్ఎస్ పట్టు సాధించింది.
ఈ ఘన విజయంలో పటాన్ చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ముందు నుంచి వార్డు స్థాయిలో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి ప్రచారం, కార్యకర్తల సమీకరణలో ఆదర్శ్ రెడ్డి చేసిన కృషి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు వార్డుల్లో విజయం సాధించగా, ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయినప్పటికీ, బీఆర్ఎస్ సాధించిన భారీ మెజార్టీతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫలితాల అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకోగా, గెలుపొందిన అభ్యర్థులు నాయకత్వానికి, ముఖ్యంగా ఆదర్శ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తైనట్లు అధికారులు తెలిపారు.

You may also like...

Translate »