పెన్షన్ పెంచాలని అంతారం గ్రామ పంచాయతీ ముట్టడి

  • వికలాంగులకు,వృద్ధులు, ఒంటరి మహిళల కు నేత గీత కార్మికులు,హెచ్ఐవి బాధి తులకు పెన్షన్ పెంచాలని గ్రామ పంచాయతీ ముట్టడి
  • పంచాయతీ కార్యదర్శి కు వినతి పత్రం

జ్ఞాన తెలంగాణ,సెప్టెంబర్ 21,మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా:
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో అంతారం గ్రామ పంచాయితి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెన్షన్ పెంచాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించి, పంచాయతీ కార్యదర్శి కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జంగం విజయ్ ప్రసాద్ మాదిగ ఎమ్మార్పీఎస్ మునిపల్లి మండల కన్వీనర్ మాట్లాడుతూ, వికలాంగులకు 6000వేలు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు నేత గీత కార్మికులు,హెచ్ఐవి బాధితులకు 4000 వేలు, కండరాల క్షీణత బాధితులకు 15000 పెన్షన్ పెంచుతా మని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

You may also like...

Translate »