జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారంలో ఆదర్శ్‌ రెడ్డి

  • మైనార్టీ సోదరులతో విస్తృత ప్రచారం
  • ప్రజా సంక్షేమమే బిఆర్ఎస్ ద్వేయం
  • మైనార్టీ వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత

రామచంద్రాపురం,అక్టోబర్‌ 24 (జ్ఞాన తెలంగాణ):

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్‌ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్‌ రెడ్డి,తెల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, డివిజన్‌ సెక్రటరీ షరీఫ్‌ తదితరులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని జమా మస్జిద్‌ ప్రాంగణంలో శుక్రవారం రోజు మైనార్టీ సోదరులతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదర్శ్‌ రెడ్డి మాట్లాడుతూ..
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధికి బలమైన నాయకత్వం అవసరం. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగల నాయకురాలు మాగంటి సునీత అని తెలిపారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ నాయకత్వంలో ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఆ అభివృద్ధి కొనసాగింపుకు ప్రజలు మళ్లీ బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు.ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేసే పార్టీగా బీఆర్ఎస్‌ నిలుస్తుంది. మైనార్టీ సమాజ అభివృద్ధికి పార్టీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది అని తెలిపారు.కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...

Translate »