గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం:పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం – పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి,మార్చి 10: గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా మహారాజుపేట పశువైద్యశాల పరిధిలోని మహారాజుపేట, జన్వాడ మరియు కొండకల్ గ్రామాలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి తెలిపారు. పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధిని ముందుగానే అరికట్టేందుకు ఈ టీకాలు అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
మహారాజుపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహ చారి, వార్డ్ మెంబర్ బిక్షం శ్రీను మరియు గ్రామ రైతులు పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. జన్వాడ గ్రామంలో కూడా పశువులకు టీకాలు వేయగా, కొండకల్ గ్రామంలో నిర్వహించిన టీకాల కార్యక్రమంలో ఉప సర్పంచ్ సీతారాం రెడ్డి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి పాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. అందువల్ల రైతులు తప్పనిసరిగా తమ పశువులకు సమయానికి టీకాలు వేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది సుప్రియ, శ్వేతా రాణి, ఆనంద్ కుమార్ పాల్గొని టీకాలు అందించారు.


