ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అనధికార తవ్వకాలు,చట్టాలకు బహిరంగ సవాల్

  • దళిత అసైన్డ్ భూములపై అక్రమాల వ్యవస్థాత్మక దోపిడీ
  • ఐదేళ్ల లీజు హామీ… 99 ఏళ్ల అగ్రిమెంటు మోసం
  • దళిత భూములే లక్ష్యం – యాదృచ్ఛికం కాదు, పద్ధతిబద్ధత
  • ప్రభుత్వ మారినా యంత్రాంగం మారలేదన్న ప్రజాభిప్రాయం
  • POT 9/77 అసైన్డ్ ల్యాండ్ చట్టం అమలు ఎక్కడ?
  • రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం – పరోక్ష మద్దతు అనుమానాలు
  • నోటీసులకే పరిమిత చర్యలు – క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యం
  • దళిత అసైన్డ్ భూముల పరిరక్షణపై ప్రభుత్వ బాధ్యత
  • బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల డిమాండ్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎక్సపీరియం యాజమాన్యం రంగా రెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దటూర్ గ్రామానికి చెందిన రైతులకు గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కెటాయించిన భూముల్లో ఇప్పు డు రియల్టర్లు తిష్ట వేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎవరికీ అమ్మకూడదు. అసైనీ తదనంతరం వారి వారసులకే దానిపై హక్కులుంటాయి. వారూ లేకుంటే ప్రభుత్వమే భూమిని స్వాధీనం చేసుకుంటుంది. అసైల్డ్ భూమిలో అసైన్డ్ భూరైతులు వ్యవసాయ అవసరాల కోసం తాత్కాలికంగా గు డిసెలు వంటివి వేసుకోవచ్చు, తప్ప. అసైన్డ్ దారులైనా, వేరే ఇంకె వరైనా శాశ్వత నిర్మాణాలు చేయొద్దు. ఈ భూమిలో క్రయవిక్ర యాలు, లీజులు చెల్లవు. పీవోటి9/77 చట్టం ప్రకారం ఆసైన్డ్ భూములను ఇతరులకు అమ్మడం, తాకట్టు పెట్టడం, కౌలుకు ఇవ్వడం దానం చెయ్యటం మరి ఏ విధమైన అన్యాక్రాంతం చేయకూడదని పి ఓ టి చట్టం 9/77 పేర్కొంది. ఈ భూములను అమ్మిన, కొనుగోలు చేసిన ప్రభుత్వం పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తుందని తెలిసు, అయినా కొందరు రియల్ ఎస్టేట్ లేదా కంపెనీల యాజమాన్యాలు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అసైన్డ్, పోరంబోకు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల నిస్సహాయత, కొందరు అవినీతి రెవెన్యూ అధికారుల సపోర్టుతో ఆక్రమాలకు పాల్పడుతున్నారు. క్రయవిక్ర యాలకు అవకాశం లేని అసైన్డ్ భూములను కొనేందుకు కొందరు రియాల్టర్లు వెంచర్ నిర్వాహకులు ప్రయత్నించారు.
అసైన్డ్ భూములను రియల్టర్లకు విక్రయించడం కోసం కొందరు స్థానికులు ముందుండి వ్యవహారం నడిపించట్లు ప్రచారం సాగుతుంది.అసైన్డ్ భూములను కొన్నా, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కష్టమని తెలిసినా, నోటరీ విక్రయాలు జరుపుతున్నారు. ఆసైన్డ్ భూములు
క్రయ విక్రయాలు జరిపితే తగు చర్యలు తీసుకుం టామని ఓ వైపు అధికారు. లు చెబుతున్నా, మాటల వరజే పరిమితమవుతు న్నాయి. అమ్మకూడదని తెలిసి లీజ్, నోటరీ పేరుతో అడ్డదారిలో విక్రయిస్తున్నారు.జిల్లాలో ఎక్కడ చూసినా భూముల ధర ఎకరా కోట్ల రూపాయలలో పలుకుతుంది. గతంతో పోలిస్తే పెట్టుబడిదారులు ఇతర రంగాలను కాదని చాలావరకు భూముల కొనుగోళ్లపైనే దృష్టి పాదిస్తున్నారు. కొందరు రియల్టర్లు పెట్టుబడిదారులు తక్కువధరలకు భూములు కొని ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయాలనే ఆశతో అసైన్డ్ భూములపై కన్నెశారు. ఇవి కొనడానికి, అమ్మడానికి వీల్లేదని చట్టం చెప్తున్నా, అడ్డదారులను వెతుకుతూ చౌకగా భూములు కాజేస్తున్నారు..

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎక్స్పీరియం పార్క్…

ప్రభుత్వ భూములు కబ్జా కు గురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం పేదలకు ఇబ్బిన అసైన్డ్ భూములు అన్నాకాంతమవుతున్నాయి. అంత అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.
“ఎక్స్పీరియం పార్క్” పేరుతో జరుగుతున్న భూ దోపిడీ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన భూ వివాదం కాకుండా, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదల హక్కులు, చట్టపాలన వైఫల్యంపై గంభీరమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ భూములు, నిరుపేద దళిత రైతుల భూములు లక్ష్యంగా సాగుతున్న అక్రమాలపై రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పొద్దుటూరు గ్రామానికి చెందిన దళిత రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 305లోని ఒక ఎకరం 20 గుంటల భూమి ఈ వివాదానికి కేంద్రంగా మారింది. 2020లో రాందేవ్ రావు అనే వ్యక్తి “బొమ్మలు తయారు చేస్తాం, చిన్న పార్క్ ఏర్పాటు చేస్తాం, ఐదేళ్లు మాత్రమే లీజు” అంటూ రైతులను నమ్మించాడని బాధితులు చెబుతున్నారు. చదువు లేని తమ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కాగితాలపై సంతకాలు తీసుకున్నాడని, కానీ ఆ ఒప్పందపు కాపీ ఇవ్వకపోగా, డబ్బులు కూడా పూర్తిగా చెల్లించలేదని వారు వాపోతున్నారు.
ఐదేళ్ల గడువు పూర్తయ్యే సమయానికి భూమి తిరిగి ఇవ్వాలని కోరితే, తమకు తెలియకుండానే 99 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ చేసినట్టుగా నకిలీ డాక్యుమెంట్లు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. “ఇది మీ భూమి కాదు” అంటూ భూమిలోకి వెళ్తే దూషణలు, హెచ్చరికలు చేస్తున్నారని తెలిపారు.
ఇదంతా చాలదన్నట్లుగా, రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో 30 నుంచి 50 ఫీట్ల లోతైన గుంతలు తవ్వి భూమిని నిర్వీర్యం చేశారని, ఇది గ్రామ భద్రతకే ముప్పుగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుటూరు పెద్ద చెరువులోకి వచ్చే వరద కాలువను కూడా మూసివేయడంతో వర్షాకాలంలో గ్రామం మునిగిపోతుందన్న భయం నెలకొంది. ఈ అక్రమాలన్నీ జీవో 111 పరిధిలో, పి ఓ టి యాక్ట్‌ను తుంగలో తొక్కుతూ జరుగుతున్నా, రెవెన్యూ అధికారులు మాత్రం “సర్వే చేస్తాం” అనే మాటలతో కాలయాపన చేస్తున్నారని బాధితుల ఆవేదన. అక్రమ నిర్వాహకులు “నాకు సీఎం తెలుసు, నాకు పెద్దల పరిచయాలున్నాయి” అంటూ బహిరంగంగా బెదిరించడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది.
దళిత రైతులపై అన్యాయం జరుగుతుంటే దళిత సంఘాలు, నాయకులు మౌనం వహించడం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. “మా భూమి మాకు ఇవ్వకపోతే ఇదే గుంతలో పడి చనిపోతాం” అనే మాటలు బెదిరింపుగా కాకుండా, తమ బతుకులు ఏ అంచున నిలిచాయో తెలిపే ఆర్తనాదమని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర దర్యాప్తు, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

You may also like...

Translate »