క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి


జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 10 :

షాబాద్ మండల కేంద్రంలో సీఎం కప్ 2024 మండల స్థాయి పోటీలు తెలంగాణ మోడల్ పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు.ఈ పోటీలను షాబాద్ ఎంపీడీవో అపర్ణ,ఎంఈఓ లక్ష్మణ్ నాయక్,సిఐ కాంతారెడ్డి ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ… విద్యార్థులు అందరూ క్రీడల్లో పాల్గొని ఉన్నతంగా రాణించాలని తెలిపారు.ఓటమి విజయానికి పునాది కావాలని, ఓటమితో కృంగి పోకూడదని విద్యార్థులకు సూచించారు.ఈ పోటీలు ఈనెల 10, 11, 12 మూడు రోజులు జరుగుతాయి.మంగళవారం వాలీబాల్ పోటీలకు గాను 20 జట్లు(బాలికలు :06, బాలురు :14) కి పోటీలు నిర్వహించారు. బుధ,గురువారాల్లో కబడ్డీ,ఖొ ఖో, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కవిత, పిడి బాబయ్య, పిఈటి సతీష్, సత్యనారాయణ, బిక్షపతి మరియు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారుబి .

అనిల్,షాబాద్ పోర్టర్

You may also like...

Translate »