రీజనల్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్‌ను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రమంత్రి ఆర్ఆర్ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును సైతం చేపడితే ఒకే సమయంలో వేగంగా పనులు పూర్తవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రీజినల్ రింగు రోడ్డు, రీజినల్ రింగ్ రైలుతో తెలంగాణ రాష్ట్రం 60 శాతం పట్టణీకరణ జరుగుతుందని అది గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ 200 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.