మైనారిటీ లకు సముచిత న్యాయం కల్పించండి

- మైనారిటీ లకు మున్సిపల్ చైర్మన్ పీఠం అందించాలని మైనారిటీ ల కోరిక
- నాజియా సర్వర్ పాషా, రిజ్వనా ముబారక్ అలీ ఖాన్ లకు ఒక అవకాశం ఇవ్వాలి
సామజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి షాద్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పిఠాన్ని మైనారిటీ లకు ఇచ్చి వారి పరదర్శకత చూపాలని మైనారిటీ వర్గం కోరుకుంటుంది.రాజకీయాల్లో పదవులు, అధికారం కాకుండా కస్టపడి పనిచేసే వారికి ఒక అవకాశం ఇచ్చి మైనారిటీ లకు న్యాయం చేయాలనీ కోరారు. ఇద్దరు మైనారిటీ మహిళలుకాంగ్రెస్ నుండి పోటీ చేసి బిఆర్ఎస్ పార్టీ ని ఓడించి తమ సత్తా చాటారు. ఒకరేమో కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ ఉద్ధoడుడు ఓటమి ఎరుగని నాయకుడు సర్వర్ పాషా, ఇంకొకరు కాంగ్రెస్ యువనాయకుడు మొదటిసారి బరిలో నిలబడి గెలుపు అందుకున్న కాంగ్రెస్ యువ నేత ముబారక్ అలీ ఖాన్.కాంగ్రెస్ పార్టీ అధికారం లో లేకున్నా పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడుతూ పార్టీ ని అధికారం లో తేవడానికి మైనారిటీ వర్గం తో కలిసి చేసిన కృషి ని అధిష్టానం, ఎమ్మెల్యే గారు గుర్తించాలని కోరారు. పార్టీ అధికారం లో ఉన్న లేకున్నా పార్టీ కొరకు కష్టపడ్డా వారిని గుర్తించి మైనారిటీ లకు న్యాయం చేయాలనీ అన్నారు. మైనారిటీ లు అంటేనే ఎలాంటి అన్యాయాలకు తావులేకుండా సామాజిక భాద్యత తో పని చేస్తారని వారికి అవకాశం ఇస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి పరదర్శకంగా పని చేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
