శంకర్‌పల్లి మున్సిపల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ,13 ఫిబ్రవరి 2026:

శంకర్‌పల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం లెక్కించిన పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్‌కు 20 ఓట్లు లభించగా, బీఆర్‌ఎస్‌కు 10 ఓట్లు, బీజేపీకి 9 ఓట్లు నమోదయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు 3 ఓట్లు వచ్చాయి.
పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ప్రారంభ దశలోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి. అయితే ఇవి మొత్తం పోలింగ్‌లో ఒక భాగం మాత్రమే కావడంతో ప్రధాన బ్యాలెట్ బాక్స్‌ల లెక్కింపుపై రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడిన తర్వాతే మున్సిపల్ పాలకవర్గంపై స్పష్టత రానుంది.
లెక్కింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పారదర్శకంగా కొనసాగుతోంది.

You may also like...

Translate »