మొయినాబాద్ మున్సిపాలిటీ చిన్న షాపూర్ వార్డులో కాంగ్రెస్ గడప గడప ప్రచారం

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న షాపూర్ వార్డులో గడప గడప ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు.

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న షాపూర్ వార్డులో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. శుక్రవారం ఆయన బృందంతో కలిసి పలు వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థించారు. ప్రతి గల్లీలో పర్యటిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేసే అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. చిన్న షాపూర్ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొక్క మాధవి ‘చేయి’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డులను ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు రామ్ రెడ్డి, షాబాద్ దర్శన్, మహేందర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, గణేష్ గౌడ్, కిరణ్, వెంకట్ రెడ్డి, విఠల్ యాదవ్, మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »