షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో బుధవారం రాత్రి యువకుని దారుణ హత్య జరిగింది.షాబాద్ సి ఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి తండ్రి బాలయ్య (35సం) కొంత కాలంగా దుర్గా వైన్స్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.ఎప్పటిలాగే బుధవారం రాత్రి పని ముగించుకొని పర్మిట్ రూం లో పడుకున్నాడు.బుధవారం రాత్రి సుమారుగా 11:30 నుంచి ఉదయం 4:00 గంటల మధ్య సమయంలో గుర్తు తెలియని దుండగులు దుర్గా వైన్స్ లోని గోడకి కన్నం వేసి లోనికి ప్రవేశించి 20,000 రూపాయల నగదును,మద్యం బాటిళ్లు,సిసి కెమెరా డివైస్ తీసుకొని బయటికి వచ్చారు.దుండగుల అలికిడితో మెలుకువ వచ్చి భిక్షపతి వారిని అడ్డుకొనగా బలమైన ఆయుధం తో అతని తలపై కొట్టడంతో భిక్షపతి అక్కడిక్కడే మరణించాడు.ఉదయం సిబ్బంది వైన్స్ తెరిచి చూడగా అందులో వాచ్ మెన్ గా పనిచేసే భిక్షపతి రక్తపు మడుగులో పడివుండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సిఐ కాంతా రెడ్డి,చేవెళ్ల ఏసిపి కిషన్,క్రైమ్ ఏసిపి శశాంక్,ఎస్ ఓ టీ ఇన్స్పెక్టర్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని,క్లూస్ టీం ఆధారంగా,ఫింగర్ ప్రింట్స్,డాగ్ స్క్వాడ్ బృందాలను ఉపయోగించుకొని ఆధారాలను సేకరించారు.మృతుని తల్లి బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.