కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు బుధవారం పరిశీలించారు , జూనియర్ కళాశాలలో అదనపు తరగతులు, టాయిలెట్లు మంజూరు కై వినత పత్రం సమర్పించడంతో స్వయంగా పరిశీలించడానికి రావడం జరిగింది , మొదటిగా జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల హాజరు శాతంపై కళాశాల ప్రిన్సిపాల్ కైసర్ పాషా సరైన సమాధానం చెప్పకపోవడంతో కళాశాల సూపర్ మార్కెట్, కిరాణా దుకాణం అనుకున్నావా, ప్రభుత్వము విద్య అభివృద్ధి కోసం అహర్నిశల కృషి చేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం పై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ ఎదుట ప్రిన్సిపాల్ ను నిలదీశారు, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 188 మంది, ప్రథమ సంవత్సరంలో 179 మంది ఉండవలసిన వారు 100 మంది విద్యార్థులు కూడా లేకపోవడంతో నన్నెందుకు పిలిచారని అసహనం వ్యక్తం చేశారు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుల నిర్లక్ష్య వైఖరి అగమ్య గోచరంగా ఉందని, తమాషాలు చేస్తున్నారా అదిలాబాద్, కొమరం భీం జిల్లాలకు తీరు మార్చుకోకపోతే బదిలీ చేస్తానని ఘంటాపథంగా చెప్పారు, ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి చేయాలి, బాన్సువాడలో ఏ కాలేజీలు ఉన్నాయని విద్యార్థులను అడగగా సరైన సమాధానం రాకపోవడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పై నీళ్లు నమలడం పోచారం శ్రీనివాస్ రెడ్డికి అసంతృప్తి గురి చేసింది, చరవాణిలో చదువు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ , గతంలో నాలుగో తరగతిలో నాటి ఉపాధ్యాయుని ప్రేరణ నేను ఇంజనీర్ కాగలిగానని, మనందరం ఎదగాలంటే అక్షరం అవసరమని విద్యార్థులకు వివరించారు, 30 లక్షల రూపాయలతో కళాశాలలో మరమ్మతులు చేపట్టాలని రోడ్డు భవనాల ఇంజనీర్కు ఆదేశించారు, అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని భవనాన్ని పరిశీలించారు, 1976లో భవన నిర్మాణం ఏర్పాటు కావడంతో శిథిలావస్థకు చేరిందని దాని మరమ్మత్తులు చేపడుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి శ్రీనివాసరావు శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు, తరగతి గదులు పరిశీలించిన తర్వాత విద్యార్థులతో పలు విషయాలు ముచ్చటించి సంతృప్తి వ్యక్తం చేశారు , ఈ కార్యక్రమంలో ఏఎంసి గైక్వాడ్ హనుమంతు , ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, తాసిల్దార్ గంగాధర్,, మాజీ జెడ్పిటిసి శంకర్, మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు