సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీచేసిన కాంగ్రెస్ నాయకులు

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీచేసిన కాంగ్రెస్ నాయకులు.

జ్ఞానతెలంగాణ,చిట్యాల,అక్టోబర్ 08: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దన నాగరాజు ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు మంగళవారం రోజున స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సిఎంఆర్ఎఫ్ చెక్కును బొట్ల నరేష్ కి అంద జేశారు, ఈ సందర్భంగా గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముద్దన నాగరాజు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,నియోజకవర్గ పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ధ్యేయమని,నిరుపేదలకు ఆర్థిక భారం కాకుండా వైద్యానికి అయ్యే ఖర్చులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చెక్కులను అందిస్తున్నారని తెలిపారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్రా శివరామకృష్ణ,డాబా వెంకటేశ్వర్లు,దండ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలు కొంక శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »